NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

27న ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి 

1 min read

ఈనెల 27వ తేదీ ఆదివారం జిల్లాలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు,గ్రామీణ బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి

జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఈనెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగ సంఘాలు  సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలకు ప్రజలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రజల సౌకర్యార్థం ఈనెల 27వ తేదీ ఆదివారం జిల్లాలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయని  జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఈనెల 26 నాల్గవ శనివారం,  27 ఆదివారం బ్యాంకు సెలవులు మరియు ఈనెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగ సంఘాలు  సమ్మె కారణంగా వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకింగ్ సేవలకు ప్రజలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రజల బ్యాంకింగ్ అవసరాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఈనెల 27వ తేదీ ఆదివారం జిల్లాలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయని, ప్రజలు తమ బ్యాంకు లావాదేవీలు యధావిధిగా చేసుకోవచ్చన్నారు. ఏటీఎంలు, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయన్నారు.

About Author