NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్యాపిలి బస్టాండ్‌లో పార్కింగ్‌పై అవగాహన

1 min read

నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ-చలాన్లు, కేసులు

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో వాహనాల పార్కింగ్‌పై ఆర్టీసీ డీఎం చలపతి, ఎస్‌ఐ నాగార్జున ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలోనే నిలపాలని సూచించారు. ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ప్రయాణికులకు, బస్సుల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు.నిబంధనలు ఉల్లంఘించి రాకపోకలకు ఆటంకం కలిగిస్తే ఈ-చలాన్లు విధించడంతో పాటు కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్టాండ్ పరిసరాల్లోని దుకాణదారులు, తోపుడు బండ్ల నిర్వాహకులు కూడా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సహకరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author