NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హిందుత్వమే ఈ దేశానికి అస్తిత్వం – భారతీయతకు మూలం సనాతన ధర్మం

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే

కర్నూలు, న్యూస్​ నేడు:  భారతదేశం అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, ఒక చైతన్యం, ఒక సంస్కృతి, ఒక జీవన విధానం. ఆ జీవన విధానమే హిందుత్వం. హిందుత్వం ఏ మతానికి వ్యతిరేకం కాదు, అది సర్వ మతాలను, సర్వ జీవులను సమభావంతో చూసే విశాలమైన, సనాతనమైన జీవన మార్గమని, హిందుత్వం -ఈ దేశపు పండుగలు, సంప్రదాయాలు, కళలు, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, భారత, భాగవతాలు అన్నీ హిందుత్వంలో భాగమేనని, ఈ దేశ ఆత్మను, అస్తిత్వాన్ని కాపాడుతున్నది హిందుత్వమేనని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మప్రచారపరిషత్ ఆధ్వర్యంలో కోవెలకుంట్ల మండలం, బిజినవేముల గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఎం. వెంకటసుబ్బయ్య, టి. వెంకటసుబ్బయ్య, జానకమ్మ, సత్యవతమ్మ, పార్వతమ్మ, శిరీష, సుబ్బలక్ష్మమ్మ, లక్ష్మీదేవి, రాధ, భారతీ, సుధామణి, మౌనిక, శ్రీనిత్య, వాణి,అనురాధతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author