ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయండి:కలెక్టర్
1 min read
ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు
అసైన్డ్,ఇనామ్,చుక్కల భూములకు పరిష్కారం
డీఈవో,రెవెన్యూ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
నిధులు కోటిన్నరకు పెంచాలని కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే..
నందికొట్కూరు న్యూస్ నేడు: కొత్తపల్లి కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి డిఈవో జనార్దన్ రెడ్డిని ఆదేశించారు.నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల కేంద్రం ఫంక్షన్ హాల్ లో శుక్రవారం’వన్ మంత్- ఫోర్ విజిట్’కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కలెక్టర్ మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరై మండలంలోని ప్రజల సమస్యల తెలుసుకొని అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా గత మూడు రోజుల క్రితం కొత్తపల్లి కేజీబీవీ పాఠశాలలో బాలిక ఆత్మహత్య ఘటనలో విద్యార్థి తండ్రి కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయమని గురువారం సాయంత్రం చెబితే ఇంతవరకు ఎందుకు సస్పెండ్ చేయలేదని డిఈవో పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే సస్పెండ్ చేసి ప్రిన్సిపాల్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ నాకు పంపాలని డీఈఓ కు చెమటలు పట్టించారు. అదేవిధంగా చిన్నచిన్న సమస్యలకు ప్రజలు అధికంగా బారులుగా వస్తున్నారు చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేరా అంటూ కలెక్టర్ తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్ ను మరియు రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే సమస్యలను పరిష్కరించి నాకు రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ ఆగ్రహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ రైజింగ్ సమర్థవంతంగా అమలు చేస్తున్నామని జిల్లాలో 40 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు అమలవుతున్నాయి జిల్లాను 15 క్లస్టర్లుగా విభజిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.ప్రజల నుండి వచ్చిన అర్జీల సమస్యలను సాధరంగా విన్న కలెక్టర్ పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సీసీ రోడ్లకు నిధులు కోటిన్నరకు పెంచండి: ఎమ్మెల్యే
పల్లె పండుగ 3.0 లో సీసీ రోడ్ల నిధులు ఒక కోటి నుండి కోటిన్నర నిధులకు పెంచే విధంగా చూడాలని ఎమ్మెల్యే కలెక్టర్ ను కోరారు అదేవిధంగా.రైతుల సమస్యలు మరియు సీడ్ హబ్ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కలెక్టర్ ను కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో సి వెంకట శివ, డీఎస్పీ రామాంజి నాయక్ మరియు జిల్లా మండల అధికారులు పాల్గొన్నారు.


