NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేవాలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

1 min read

టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మరో ముందడుగు

ముఖ్యఅతిథిగా హాజరైన సుగవాసి ప్రసాద్ బాబు

అన్నమయ్య జిల్లా (న్యూస్ నేడు ప్రతినిధి): అన్నమయ్య జిల్లా పివిఆర్ నియోజకవర్గంలోనివాయల్పాడు మండలం – శ్రీ పట్టాభి రామస్వామి ఆలయం & తరిగొండ – శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం పీలేరు నియోజకవర్గం వాయల్పాడు మండలంలోని శ్రీ పట్టాభి రామస్వామి ఆలయం, తరిగొండలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు , పీలేరు ఎమ్మెల్యే  నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి  పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా  రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు తిరుపతి పార్లమెంట్ టిడిపి అధ్యక్షురాలు పనబాక లక్ష్మి  , తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి శంకర్ యాదవ్  పాల్గొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక క్షేత్రాల పరిరక్షణ, భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక పాలన, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సేవాభావం, మంత్రి నారా లోకేష్  అభివృద్ధి దృక్పథంతో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధితో పాటు దేవాలయాల అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తోంది.టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు నేతృత్వంలో టీటీడీ పరిధిలోని ఆలయాలు, అనుబంధ క్షేత్రాల్లో భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు జరుగుతున్న కార్యక్రమాలు అభినందనీయం.పీలేరు ఎమ్మెల్యే శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి చొరవతో నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం.ధర్మ పరిరక్షణ – ఆలయాల అభివృద్ధి – భక్తుల సంక్షేమం అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్న తీరు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోందన్నారు.

About Author