NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

షూటింగ్ బాల్‌లో హోళగుంద విద్యార్థుల ప్రతిభ

1 min read

రాష్ట్రస్థాయి పోటీలకు మణిశంకర్, అభిరామ్ అర్హత

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు షూటింగ్ బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు, మండలానికి మంచి పేరు తీసుకొచ్చారు.ఈ నెల 25న కర్నూలు జిల్లాలోని గుడ్ షెప్పర్డ్ స్కూల్‌లో నిర్వహించిన 9వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ ఛాంపియన్‌షిప్–2026 (సీనియర్ మెన్ & ఉమెన్) పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హోళగుందకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.10వ తరగతి ఏ విభాగం నుంచి మణిశంకర్, అభిరామ్, బి విభాగం నుంచి అరుణ్, సాయికుమార్, సి విభాగం నుంచి రమేష్, డి విభాగం నుంచి ఇషాన్, సూర్య పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు.వీరందరిలో మణిశంకర్, అభిరామ్ రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో గుంటూరులోని బీఎస్‌ఎస్‌బీ జూనియర్ కళాశాలలో జరగనున్న రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో వారు పాల్గొననున్నారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హోళగుంద ప్రధానోపాధ్యాయులు పి. కబీర్ సాబ్ విద్యార్థులను అభినందించి, వారికి సర్టిఫికెట్లను అందజేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి. కబీర్ సాబ్, ఇన్‌చార్జి హెచ్‌ఎం యూనిస్ , పీడీ, అపర్ణ ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

About Author