NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మదనపల్లెలో రూ. 27 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ

1 min read

ప్రభుత్వం అభివృద్ధికి కట్టు బడి పనులను పరుగులు పెట్టిస్తోంది

ఎమ్మెల్యే షాజహాన్ బాషా

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి  : మదనపల్లె పట్టణా నికి హైబ్రిడ్ యూనిటీ మోడల్ అభివృద్ధిలో భాగంగా 27 కోట్ల రూపాయలతో మంజూరైన సిసి రోడ్లు, బీటీ రోడ్లు మరియు పలు అభివృద్ధి కార్య క్రమాలకు స్థానిక కూటమి నాయ కులు, మున్సిపల్ కమీషనర్, సిబ్బంది తో కలసి ఎమ్మెల్యే షాజహాన్ భాషా సోమవారం భూమి పూజ చేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లా డుతూ మదనపల్లె పట్టణ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వ ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీలతో అభివృద్ధిలో పోటీప డేలాగా మదనపల్లె పట్టణాన్ని ముందుకు తీసు కెళ్తామని తెలిపారు. మదనపల్లె పట్టణ అభివృద్ధికి కోట్ల రూపాయలు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలిపారు. గడిచిన 10 సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో రోడ్లు అద్వాన్న పరిస్థితికి చేరుకున్నాయని ఆరోపించారు. కనీసం ప్రజలు సవ్యంగా రాక పోకలు సాగించలేని దయనీయ పరిస్థితి కి రోడ్లు చేరుకున్నా యని నిప్పులు చెరిగారు. పుర ప్రజలకు అన్ని విధాల తెలుగుదేశం పార్టీ అండగా నిలబడి అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తుందని స్పష్టం చేశారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్ష వైయస్సార్సీపి  చేస్తున్న ఆరోపణల ను తిప్పి కొట్టారు. గడిచిన 10 ఏళ్ల వైఎస్ఆర్సిపి పాలన పైన తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పైన ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడే సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరిస్తూ అభివృద్ధిని కార్యరూపంలో ముందుకు తీసుకు వెళుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

About Author