NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిట్స్‌లో ఏఐసిటిఈ స్మార్ట్ ఇండియా ఇంటర్నల్ హ్యాక థాన్ – 2026

1 min read

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి  : మదనపల్లె సమీపం లో గల (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సి టీ లోని మిట్స్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యూబేషన్ సెల్, స్టార్ట్అప్ సెల్ అండ్ సి.ఎస్.ఈ – ఆర్టిఫిషల్ ఇంటెలి జెన్స్ విభాగం వారి సంయుక్త ఆధ్వర్యం లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యు కేషన్ (ఏఐసిటిఈ) స్మార్ట్ ఇండియా ఇంటర్నల్ హ్యాకథాన్–2026  కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ జ్యోతి ప్రజ్వలనతో  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి.రామ నాథన్ మాట్లా డుతూ వాస్తవ ప్రపంచంలో ఎదుర వుతున్న వివిధ సవాళ్లకు సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న పరిష్కా రాలను రూపొందిం చేలా విద్యార్థులను ప్రోత్సహించడం, వారిలో ఆవిష్క రణ, సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపు ణ్యాలు, జట్టుకృషి, సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడం ఈ హ్యాకథాన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ హ్యాకథాన్‌లో మొత్తం 73 విద్యార్థి బృందాలు ఉత్సా హంగా పాల్గొన్నా యని పేర్కొన్నారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు బృందాలుగా ఏర్పడి, వారికి కేటాయించిన విభిన్న సమస్య ప్రకటనలపై పనిచేస్తూ వినూత్న పరిష్కారాలను రూపొందించారని పేర్కొన్నారు. విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞా నాన్ని వినియోగిస్తూ సమస్యలను విశ్లేషించడం, పరిష్కారాలను రూపొందించడం, వాటిని ప్రాజెక్టుల రూపంలో అభివృద్ధి చేయడం ద్వారా నూతన పరిశోధన, సాంకేతిక ఆవిష్క రణలపై ఆచరణా త్మక అవగాహన పొందారని తెలిపారు. ఇంటర్నల్ హ్యాక థాన్‌లో పాల్గొన్న 73 బృందాల్లో ప్రతిభ కనబరిచిన 50 ఉత్తమ బృందాలను తదుపరి దశకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన ఈ మొదటి 50 బృందాల ప్రాజెక్టు నివేదికలను ఏఐసిటిఈ పోర్టల్‌లో సమర్పించినట్లు స్పష్టం చేశారు. ఏఐసిటిఈ పోర్టల్ ద్వారా పరిశీలన అనంతరం ఎంపికయ్యే బృందాలు జాతీయ స్థాయిలో నిర్వ హించే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌లో పాల్గొని తమ పరిష్కారాలను ప్రదర్శించే అవకాశం పొందుతారని తెలిపారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ  ఏఐసిటిఈ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కు  మిట్స్ విద్యార్థి బృందాలను సిద్ధం చేయడంలో ఈ ఇంటర్నల్ హ్యాకథాన్ ఒక ముఖ్యమైన వేదికగా నిలిచిందని వెల్లడించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం, సమస్య పరిష్కార సామర్థ్యం మరియు సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి కార్య క్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ.ఐ.సి కోఆర్డినేటర్ డాక్టర్ కే చొక్క నాథన్, కోఆర్డినేటర్ బి భాస్కర్, స్టార్ట్అప్ సెల్ కోఆర్డినేటర్ ప్రనీల్ కుమార్, జి విశ్వనాథ్, ఎస్.గోపాల కృష్ణన్, అధ్యాపకులు , విద్యార్థులు  పాల్గొన్నారు.

About Author