NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లీనియర్ ప్రాజెక్టులకు మట్టి తవ్వకాలకు నిబంధనలు తప్పనిసరి..

1 min read

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు: లీనియర్ ప్రాజెక్టులకు అవసరమైన మట్టి తవ్వకాలు, తరలింపులకు అనుమతులు జారీ చేసే సమయంలో సంబంధిత నిబంధనలు, పర్యావరణ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ లో  లీనియర్ ప్రాజెక్ట్‌ల కోసం మట్టిని త్రవ్వే సమయంలో పాటించాల్సిన ప్రామాణిక నిబంధనలు మరియు పర్యావరణ భద్రతా విధానాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా మట్టి తవ్వకాల అనుమతులకు సంబంధించిన 3 దరఖాస్తులను పరిశీలించారు.. ఇందులో Sri SCL Infratech Ltd, M/s SRC Infra Developers Private Limited సంస్థలకు సంబంధించిన ప్రతిపాదనలను కలెక్టర్ పరిశీలిస్తూ, Sri SCL Infratech Ltd సంస్థలకు సంబంధించిన ప్రతిపాదనలలో రైల్వే వర్క్స్‌కు సంబంధించి పెద్దటేకూరు గ్రామం సర్వే నంబర్‌ 112లో మట్టి తవ్వకాల అనుమతికి అవసరమైన స్కెచ్‌ సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్  కల్లూరు తహసిల్దార్ ను ఆదేశించారు.. అవసరమైన పత్రాలు పూర్తిగా ఉన్నందున సంబంధిత సంస్థలకు నిబంధనల మేరకు అనుమతులు జారీ చేయడం జరిగిందని కలెక్టర్ స్పష్టం చేశారు. మట్టి తవ్వకాల్లో తవ్వకం లోతు, జలవనరుల పరిరక్షణ వంటి అంశాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు… తవ్వకాల సమయంలో తగిన డ్రైనేజీ ఏర్పాట్లు చేయడంతో పాటు, టాప్‌ సాయిల్‌ను విడిగా తొలగించి భద్రపరచాలని కలెక్టర్ స్పష్టం చేశారు. తవ్వకాలు నిర్దేశించిన పరిమితి మేరకే చేపట్టి, అనంతరం సరైన ల్యాండ్‌ లెవెలింగ్‌, బ్యాక్‌ఫిల్లింగ్‌, సురక్షిత డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలన్నారు. . అనుమతులు పొందిన ప్రాంతంలోనే తవ్వకాలు చేపట్టాలని, ప్రాంతం మార్చాల్సి వస్తే సంబంధిత సంస్థ మళ్లీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. మొత్తం 20,000 క్యూబిక్‌ మీటర్ల పరిమితిలోనే మట్టి తవ్వకాలు చేపట్టాలని, అంతకు మించి మట్టి తవ్వకం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సమావేశంలో గనుల శాఖ డిడి నాగిని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ కిషోర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About Author