పార్టీ సిద్ధాంతాలతో పాటు ప్రతి మనిషి భావాలను గౌరవించే నాయకుడు ఈడిగ గోవింద్ గౌడ్
1 min read
ఆలూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు
పార్టీకి అతీతంగా మనుషులను గౌరవిస్తూ ముందుకు సాగుతున్న నాయకత్వం
హోళగుంద న్యూస్ నేడు: పార్టీ అన్నాపార్టీ సిద్ధాంతాలు అన్నా, అదే విధంగా మనుషులు అన్నా, వారి సిద్ధాంతాలు, అభిప్రాయాలను గౌరవిస్తూ అందరితో స్నేహపూర్వకంగా మెలిగే నాయకుడిగా ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈడిగ గోవింద్ గౌడ్ గుర్తింపు పొందుతున్నారు.పార్టీ పట్ల తన నిబద్ధతను కొనసాగిస్తూనే, వివిధ వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో ఆత్మీయంగా మెలుగుతూ వారి అభిప్రాయాలను గౌరవించడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమే అయినప్పటికీ వ్యక్తిగత సంబంధాలకు విలువనిస్తూ అందరినీ గౌరవించే విధానం గోవింద్ గౌడ్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ముందుకు సాగుతున్నారని తెలిపారు.“పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తూనే.. మనుషులను, వారి అభిప్రాయాలను గౌరవించడం నిజమైన నాయకత్వ లక్షణం” అనే భావనతో ఈడిగ గోవింద్ గౌడ్ ముందుకు సాగుతున్నారని అభిమానులు, అనుచరులు పేర్కొన్నారు.


