NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పౌర హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై దిలీప్ కుమార్

1 min read

ఎస్సీ కాలనీలో ప్రజలతో సమావేశం – సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచన

హోళగుంద న్యూస్ నేడు: పౌర హక్కుల దినం కార్యక్రమంలో భాగంగా హోళగుంద మండలం సమ్మతగేరి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రజలతో అవగాహన సమావేశం నిర్వహించారు. హోళగుంద ఎస్సై దిలీప్ కుమార్, స్థానిక మండల తహసీల్దార్‌తో కలిసి కాలనీ ప్రజలతో సమావేశమై పౌర హక్కులు, సామాజిక జీవన విధానం, చట్టాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, పౌర హక్కుల పరిరక్షణకు సంబంధించిన చట్టాలు, ఇతర న్యాయపరమైన అంశాలపై ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ హక్కుల గురించి తెలుసుకోవడంతో పాటు, చట్టాలను గౌరవిస్తూ ప్రశాంత వాతావరణంలో జీవించాలని సూచించారు.గ్రామంలో లేదా కాలనీలో ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. చట్టపరమైన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, సమస్యలు తలెత్తినప్పుడు భయపడకుండా అధికారులను సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *