15 రోజుల్లోపు డంప్ యార్డ్ తీసేయాలి
1 min read
వైసీపీ హయాంలోనే షాదీఖానా పూర్తి
వైసీపీ ఇన్చార్జి డాక్టర్ సుధీర్ ఫైర్..
నందికొట్కూరు న్యూస్ నేడు: 15 రోజులోపు నందికొట్కూరు పట్టణంలో ఉన్న డంప్ యార్డును తొలగించాలని లేనిపక్షంలో డంపు యార్డ్ దగ్గరే మహాధర్నా చేపడతామని నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ మున్సిపాలిటీ అధికారులను హెచ్చరించారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం వైసీపీ కార్యాలయంలో బుధవారం డాక్టర్ సుధీర్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలోనే 2024 జనవరి లోపే షాది ఖానా స్లాప్ వేసి పూర్తి చేశామన్నారు.షాదిఖానా మా ప్రభుత్వ హయాంలో పూర్తిచేస్తే మేము పూర్తి చేశామంటూ టిడిపి నాయకులు గొప్పగా చెబుతున్నారని వీటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనేఅలగనూరు రిజర్వాయర్ మరమ్మతు పనులు ప్రారంభిస్తామని గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన టిడిపి నాయకులు ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా కూడా పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏఏ సమస్య పైనా అయినా సరే చర్చించేందుకు నేను సిద్ధమే పటేల్ సెంటర్ దగ్గరికి మీరు రండని టిడిపి నాయకులకు ఆయన సవాల్ విసిరారు. ప్రెస్ మీట్ లో ఏవిధంగా మాట్లాడాలో తెలియని వాళ్లు కూడా మాట్లాడుతున్నారు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.చేయని పనుల గురించి మాట్లాడితే కల్లబొల్లి మాటలు మాట్లాడితే ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని డాక్టర్ సుధీర్ అన్నారు. మంగళవారం జరిగిన పాఠశాల కమిటీ ఎన్నికల్లో హెచ్ఎంలు ఎంఈఓ లు చూడాల్సిన పనుల్లోనూ పోలీసుల జోక్యం ఏంటని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసిలు పర్వత యుగంధర్ రెడ్డి,పుల్యాల నాగిరెడ్డి,సుధాకర్ రెడ్డి, చిన్న మల్లారెడ్డి,మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి,తులసి రెడ్డి,పట్టణ అధ్యక్షులు మన్సూర్, జబ్బార్,సురేష్ యాదవ్, మాధురి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


