జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలి… బి. గిడ్డయ్య
1 min read
ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య
న్యూస్ నేడు, పత్తికొండ: కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్ జ్ఞానేశ్ కుమారును పదవి నుండి తొలగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక చదువుల రామయ్య భవనం నుండి నాలుగు స్తంభాల మండపం వరకు ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లోకి తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. స్వయం ప్రతిపత్తి తో వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం బిజెపి చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందన్నారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అనేక అక్రమాలకు కారకులైన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను తక్షణమే బర్తరఫ్ చేసి, ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను సరిచేసి, అర్హులైన పౌరుల వివరాలను పరిశీలించి, వారి ఓటు హక్కును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సిపిఐ మండల కార్యదర్శి యు. కారుమంచి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి.రాజా సాహెబ్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్రయ్య, సిపిఐ జిల్లా సమితి సభ్యులు తిమ్మయ్య, సురేంద్ర కుమార్, పెద్ద ఈరన్న, నెట్టి కంటయ్య, గిడ్డయ్య గౌడ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీరాములు గౌడ్,. మండల సహాయ కార్యదర్శి జలపురం కాసిం. ప్రజా సంఘాల నాయకులు హనుమేష్, రంగన్న, మాదన్న, ఉరుకుందు, నరసింహులు, ఖాన్, రవి, హనుమంతు, చిన్న ముని . రవి.తదితరులు పాల్గొన్నారు.


