దేశ అభివృద్ధి లో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. డాక్టర్. శంకర్ శర్మ…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: అట్యా- పట్యా భారతీయ సంప్రదాయ క్రీడల్లో ఒకటని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. అట్యా పట్యా కర్నూలు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో డీఎస్ఏ మైదానంలో జిల్లా స్థాయి అట్యా పట్యా పోటీలు నిర్వహించారు. ఈపోటీల్లో విజేతలకు ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ శంకర్ శర్మ జ్ఞాపికాలను ప్రసంశ పత్రాలను అందజేశారు. ఈకార్యక్రమం డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూక్రీడల్లో బాలికలు ఎక్కువ పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అందరూ మహిళా సాధికారత కోరుకున్నట్లే మహిళలు అన్ని రంగాల్లో రాణించడం హర్షించదగ్గ విషయం అన్నారు. అమరావతి రాష్ట్ర రాజధానిగా ఏర్పడితే స్పోర్ట్స్ రాజధానిగా కర్నూలు రోజురోజు అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. బాలికలు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడమే ఇందుకు నిదర్శనం అన్నారు. క్రీడాకారులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు సహకరించడం స్వాగతిస్తున్నామని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ లో పాల్గొన్న క్రీడాకారులకు రిజర్వేషన్లు సైతం ఉన్నాయని వాటిని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు చదువుతోపాటు శారీరం దృఢత్వంగా మారడంతో వారు ఆరోగ్యంగా కూడా ఉంటారన్నారు.ఈకార్యక్రమంలో అట్యా పట్యా కోచ్ నాగరత్నమయ్య పాల్గొన్నారు.


