12 వ పిఆర్సి జీవో విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు …
1 min read
కర్నూలు,న్యూస్ నేడు: ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు సంబంధించిన సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేస్తూ జీవో no 200 విడుదల చేస్తూ కమిషన్ చైర్మన్ గా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ని ప్రభుత్వం నియమిస్తూ ఈరోజు ఉత్తర్వులు విడుదల చేయడం కర్నూలు జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ మరియు ఏపీ జేఏసీ పక్షాన ముఖ్యమంత్రి కి మరియు ఏపీ జేఏసీ చైర్మన్ కామ్రేడ్ అలపర్తి విద్యాసాగర్ కి, ఏపీజేఏసీ సెక్రటరీ జనరల్ ప్రసాద్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ కి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ…ఈ సందర్భంగా గత నెల 5వ తేదీ ముఖ్యమంత్రి తో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు రెండు డి ఏ ల జీవోలు,పెన్షనర్లకు రెండు డి ఆర్ జీవోలు,మరియు పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం ఆప్ పెన్షన్ కు సంబంధించి జీవో విడుదల,ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించి EHS NTR ట్రస్ట్ కు నేరుగా ఉద్యోగుల డబ్బు మరియు ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ కలిపి నేరుగా డబ్బు బదిలీ చేయుటకు జీవో విడుదల చేయడం..పెండింగ్ లో ఉన్న డీఏ బకా యులకు సంబంధించి నిధి పోర్టల్ నందు బిల్లులు సమర్పించుటకు అవకాశం కల్పించినందుకు, వీటిన్నీటితో పాటు మూడు సంవత్సరాలుగా ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అతి ముఖ్యమైన పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేస్తూ ఈరోజు జీవో విడుదల చేయడం ఉద్యోగ, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు సంబరాలు చేసుకుంటూ ఉద్యోగుల హార్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి మరియు ఏపీ జేఏసీ చైర్మన్ కామ్రేడ్ అలపర్తి విద్యాసాగర్ కి ఉద్యోగులు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ…ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వీ జవహర్లాల్ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సి కాశన్న, ఏపీజేఏసీ జిల్లా కార్యదర్శి ఎస్ ఇస్మాయిల్ మరియు కర్నూలు జిల్లా కార్యవర్గము నగర కార్యవర్గ సభ్యులు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.


