NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లతో పేదలకు ఎనలేని భరోసా లభిస్తోంది

1 min read

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

ప్రతినెలా మొదటి తేదీనే పేదల ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందజేస్తూన్న కూటమి ప్రభుత్వం

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లతో పేదలకు ఎనలేని భరోసా లభిస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ప్రతినెలా మొదటి తేదీనే పేదల ఇంటికి వెళ్ళిమరీ పెన్షన్లు అందజేస్తూ కూటమి ప్రభుత్వం వారికి మనోధైర్యం కల్పిస్తోందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ల ముందుచూపుతోనే ఇదంతా సాధ్యమవుతోందని ఆయన స్పష్టం చేశారు. అతి త్వరలో కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురువారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక 29వ డివిజన్‌ కుమ్మరి రేవులో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్టీసీ విజయవాడ జోన్‌ – 2 చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి తొలుత ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం డివిజన్‌లోని పెన్షన్‌ దారుల ఇళ్ళకు వెళ్ళిన ఎమ్మెల్యే బడేటి చంటి,,, వారికి పెన్షన్‌ మొత్తాలను పంపిణీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, బెడ్‌ పేషెంట్లకు పెన్షన్‌ సొమ్ములు అందిస్తూ వారి బాగోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అలాగే స్థానికులను అడిగి పలు సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే చంటి,,, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతోనే ప్రతినెలా పెన్షన్‌ల పంపిణీలో పాల్గొంటున్నానని తెలిపారు. సీఎం చంద్రబాబు సంకల్పం మేరకు అర్హులందరికీ ఆర్ధిక మేళ్ళు చేకూరాలనే ఆలోచనను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేస్తున్నామని, అందరికీ సంక్షేమ పథకాలు చేరవేస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎ యం సి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వీరంకి పండు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, మాజీ కార్పొరేటర్ వుచుల సన్నీ చైతన్య, క్లస్టర్ ఇంచార్జ్ వందనాలు శ్రీనివాసరావు, డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మారగాని సుబ్బారావు, డివిజన్ తెలుగుదేశం పార్టీ కో ఇంచార్జ్ పెదపూడి లోవరాజు, జనసేన డివిజన్ ఇంచార్జ్ రామిశెట్టి కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ గంటా రమేష్, కుటమి పార్టీల నాయకులు బుద్ధ చంటి, పూర్ణ, శంకర్, షేక్ మీరా, వేల్పూరి మంగరాజు, అల్లాడ శివకుమార్ మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *