హోళగుంద మండలంలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
1 min read
లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన టీడీపీ, కూటమి నాయకులు
హోళగుంద న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా హోలగుంద మండలంలో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఆలూరు టీడీపీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ ఆదేశాల మేరకు హోళగుంద మండలంలోని ఇంద్రానగర్ కాలనీ బూత్ నంబర్ 45 పరిధిలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.బూత్ ఇన్చార్జి, మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య, ప్రజా నాయకుడు, తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యాట శేషగిరి, రాజా పంపాన గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు తదితర లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ షబ్బీర్, బూత్ ఇన్చార్జి, ఐటీడీపీ నాయకుడు హనుమంతు, తెలుగుదేశం పార్టీ నాయకులు కురువ మల్లి, ఆదం, అమన్, అన్సర్, జంగల్ లక్ష్మన్న, ఏరి స్వామి, గంగ, సచివాలయ సిబ్బంది శివకృష్ణ నాయక్తో పాటు టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


