రైల్వే స్టేషన్ రోడ్డులో శ్రమదానం.. స్వచ్ఛతా హీ సేవాలో పాల్గొన్న మున్సిపల్ అధికారులు
1 min read
ఆదోని, న్యూస్ నేడు: ఆదోని పురపాలక సంఘం పరిధిలో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా బుధవారం భారీ శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ‘ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాత్’ నినాదంతో పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో శ్రమదానం చేపట్టారు.ఈ సందర్భంగా కమిషనర్ నయీమ్ అహ్మద్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. ప్రతిరోజూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని, స్వచ్ఛ ఆదోని నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు.ఎంహెచ్ఓ డాక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు చెత్తను రోడ్లపై, కాలువల్లో వేయకుండా నేరుగా మున్సిపల్ వాహనాలకే అందించాలని సూచించారు.అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు చీపుర్లు చేతబట్టి రోడ్లను శుభ్రం చేసి వ్యర్థాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, బీజేపీ నాయకులు నాగరాజు గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, మున్సిపల్ సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.


