NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ల్యాప్ ట్యాప్ లు అందజేత 

1 min read

న్యూస్ నేడు,  పత్తికొండ : పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థి చిట్టెం హనుమాన్ ప్రసాద్ ల్యాబ్ ట్యాప్ లను అందజేశారు. గురువారం పూర్వ విద్యార్థి చిట్టెం హనుమాన్ ప్రసాద్ కుటుంబ సభ్యులు లక్ష్మీనారాయణ 4 ల్యాప్ ట్యాప్ లను కళాశాల ప్రిన్సిపాల్ నయిమున్నిసా బి కి అందజేశారు. పూర్వ విద్యార్థి చిట్టెం హనుమాన్ ప్రసాద్ బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించారని తెలిపారు. ఆయన అందజేసిన ఈ ల్యాప్ ట్యాప్ లు కళాశాలలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న  విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి చిట్టెం హనుమాన్ ప్రసాద్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ప్రిన్సిపాల్ నయిమున్నిసా బి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లెక్చరర్ వీరేశప్ప, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *