మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి ఈడిగ గోవింద్ గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు
1 min read
శాలువా, పూలమాలతో ఘనంగా సత్కారం
హోళగుంద న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నాయకులు కేఈ కృష్ణమూర్తి 88వ జన్మదినం సందర్భంగా ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈడిగ గోవింద్ గౌడ్ ఆయనను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కేఈ కృష్ణమూర్తికి శాలువా కప్పి, పూలమాల వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈడిగ గోవింద్ గౌడ్ మాట్లాడుతూ, కేఈ కృష్ణమూర్తి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ తమపై ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబును, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎస్. పంపాపతి, యరిస్వామి, టీడీపీ మండల మైనార్టీ అధ్యక్షులు ముల్లా మోయిన్, బుడగజంగాల రామాంజిని, కనయ్య తదితరులు పాల్గొన్నారు.



