శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
1 min read
కోచ్ ని,పీఈటిని,విద్యార్థిని అభినందించిన ప్రిన్సిపాల్
ఏలూరు జిల్లా న్యూస్ నేడు : పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చెందన విద్యతో పాటు అనేక రంగాలలో విద్యార్థిని విద్యార్థులు తమదైన శైలిలో విద్యార్థి దశ నుంచే నేటి ఆధునిక యుగంలో రాణిస్తున్నారు. ఆ కోవకే చెందిన వి.హర్ష తేజ తొలి అడుగులు వేస్తున్నాడు. వివరాల్లోకి వెళితేఏపీ స్కూల్ గేమ్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో అండర్ 17 రాష్ట్ర స్థాయి సెలక్షన్ కు 98 కేజీలు విభాగంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో చదువుతున్న విద్యార్థి వి.హర్ష తేజ ఏలూరులో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో తన ప్రతిభను చాటుకున్నాడు. ఆ గుర్తింపుతో త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ కె.శివకుమారి, పిఈటి విజయ్ వి.హర్ష తేజ కి మరియు ఈ విజయానికి కారకులైన కోచ్ బసివిరెడ్డి షణ్ముఖ కుమార్ కి అభినందనలు తెలియజేశారు.


