NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలి

1 min read

వామపక్ష,ప్రజాస్వామ్య పార్టీలు ధర్నా..

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు సీపీయం,సీపీఐ(యం ఎల్)లిబరేషన్,సీపీఐ(యం ఎల్)న్యూ డెమోక్రసీ,యం సీపీఐ(యు)మరియు ఎస్ డిపిఐ పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.సీపీఐ (యు)జిల్లా కో-కన్వీనర్ డక్కా కుమార్ అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు,కార్యకర్తలు ప్ల కార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి మరియు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తూ,పౌరుల రాజ్యాంగ బద్ధమైన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా నిరసనను చేపట్టడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు,సీపీఐ(యం ఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వరులు మరియు సీపీఐ(యం,ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు పి.లాజరస్,ఎస్డిపిఐ జిల్లా నాయకులు అబ్దుల్ రెహమాన్ ప్రసంగించారు.భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన అత్యంత కీలకమైన ప్రాథమిక హక్కు ఓటు హక్కు అని,ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే పునాది అని వారు వారన్నారు.దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్లు పైగా  ఓట్లను అక్రమంగా వతొలగించడం దారుణమని ధ్వజమెత్తారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కోసమే ఎన్నికల సంఘం ఇలాంటి అక్రమ తొలగింపులకు పాల్పడుతోందనిబాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను తక్షణమే తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు యం.కర్ణ,శ్రీనివాసులు, నరసింహులు,బిబి,  వెంకటేశ్వర్లు,పి.మర్రిస్వామి, మద్దమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *