NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పనుల గుర్తింపుపై జడ్పీ సీఈవో అవగాహన

1 min read

కన్నమడకల’లో శానిటేషన్ కాంప్లెక్స్ ప్రారంభం..

ఓర్వకల్లు న్యూస్ నేడు: 2026-27 సంవత్సరానికి గాను విబిజీ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో ఏఏ అభివృద్ధి పనులు చేపట్టాలనే వాటి గురించి కర్నూలు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సుధాకర్ రెడ్డి అవగాహన కల్పించారు. ఓర్వకల్లు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి సీఈవో,జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మి, డివిజనల్ అభివృద్ధి అధికారి అశ్వినీ కుమార్, ఎంపీడీవో నాగ అనసూయ హాజరయ్యారు.శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి అధికారులు నివాళులు అర్పించారు.ప్రతి గ్రామ పంచాయతీలో పనుల గురించి గ్రామసభలు నిర్వహించినట్లు ఎంపీడీవో తెలిపారు.ఈ సందర్భంగా సీఈఓ మరియు డిపిఓ మాట్లాడుతూరాబోవు కాలంలో నీటి సంరక్షణపై తీసుకోవలసిన విధానాల గురించి పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు.బాల్య వివాహాల అరికట్టడానికి ప్రజలందరూ తమ ప్రాంతంలో విరివిగా అవగాహన కల్పించాలి బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో భాగంగా ఓర్వకల్ పంచాయతీ పారిశుధ్య కార్మికులను శాలువాలతో సన్మానించారు.కన్నమడకల గ్రామంలో కమ్యూనిటీ శానిటేషన్ కాంప్లెక్స్ ను ఎంపీడీవో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు గిరిధర్,శ్రీలతనాయకులు గోవింద్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, లక్ష్మీకాంత రెడ్డి పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *