NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి

1 min read

జ్ఞానేశ్ కుమార్ వైఖరిపై కాంగ్రెస్, వామపక్షాల నిరసన

రాజీనామా చేయాలని డిమాండ్

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి  : జాతిపిత మహాత్మా గాంధీ అడుగు జాడల్లో నడు స్తామని కాంగ్రెస్ పార్టీ మదనపల్లె సీనియర్ నాయ కులు రెడ్డి సాహెబ్ అన్నారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని స్థానిక బెంగుళూరు బస్టాండ్ ఇందిరమ్మ సర్కిల్ వద్ద జాతి పిత ఫ్లెక్సీ కి గజ మాల వేసి పూల వర్షం కురి పిస్తూ నివాళులు అర్పించారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వైఖరి ని ఖండిస్తూ కాంగ్రెస్, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రెడ్డి సాహెబ్ మాట్లా డుతూ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇప్పటి వరకు 13.54 కోట్ల ఓట్లను తొలగించ డం ఆయన నిరంకుశ వైఖరికి నిదర్శ నమని విమర్శించారు.కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి అను కూలంగా వ్యవహరి స్తున్నారంటూ విమర్శలు గుప్పిం చారు. ఎక్కడైతే బిజెపికి ఓట్లు అనుకూలంగా పడవో అ వర్గాలకు ఓటు హక్కు లేకుండా జాబితా నుంచి తొలగించడం జరుగుతొందన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కనుసన్నల్లో పనిచేస్తున్న జ్ఞానేష్ కుమార్ గద్దె దిగాలని లేకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చ రించారు. సీపీఐ నాయకులు కృష్ణప్ప, సిపియం నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన  స్వతంత్ర సంస్థగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంద న్నారు. అయితే సర్ పేరులో ఓట్ల చోరీ కి పాల్బడు తున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ తన పదవికి రాజీనామా చేయా లని  డిమాండ్ చేశారు. ప్రజా స్వామ్యంలో ప్రజలకు వజ్రాయుధమైన ఓటు హక్కును నిరాకరించడమే ఇందుకు ప్రధాన కారణం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మరియు ఇండియా కూటమి పార్టీ ల నాయకులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *