NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చెరుకుచెర్ల’లో అంగన్వాడీ మాసోత్సవాలు

1 min read

అంగన్వాడీ కార్యకర్తలకు ఘనంగా సత్కారం..

మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చెరుకుచెర్ల గ్రామంలో శనివారంసేవా సంకల్ప్ అభియాన్ 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు అంగన్వాడి సూపర్వైజర్ రేణుకా దేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ అంగన్వాడి మన బాధ్యత పోషణతో ఆరోగ్యంతో మంచి భవిష్యత్తు అనే నినాదంతో  కేంద్రంలో పిల్లలకు అందించే పౌష్టికాహారం,విద్యా బోధన గురించి పిల్లల ఆరోగ్యం,ఎదుగుదల గురించి వివరించారు. పోషణ మాసోత్సవంలో 5 అంశాల గురించి మరియు గర్భవతులు బాలింతల ఆరోగ్య జాగ్రత్తల గురించి వివరించారు.ఈనెల 7వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.తర్వాత గ్రామ నాయకులు సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీలో మంచి పోషకాహారం ఇస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తర్వాత మంచిగా సేవలు అందించిన అంగన్వాడీ కార్యకర్తలు ఉమాదేవి,శైలజ,సుబ్బమ్మ, కైరున్ భీ లను శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పి శేషి రెడ్డి,ఏ వేణుగోపాల రావు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *