అక్టోబర్ 5 నుంచి 8 వరకు ఎఫ్ఏ–2 పరీక్షలు
1 min read
మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు
హొళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి మరియు జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు, కర్నూలు వారి ప్రొసీడింగ్స్ Rc.No.20/DCEB-Knl/2026-27, తేదీ 25.09.2026 ప్రకారం, 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి హొళగుంద మండలంలోని అన్ని ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్–II (FA–II) / సెల్ఫ్ అసెస్‌మెంట్ మోడల్ పేపర్–2 పరీక్షలు నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖాధికారులు–1 డాక్టర్ సుధారాణి, –2 పి. కబీర్ సాబ్ తెలిపారు.
పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది:
ప్రాథమిక తరగతులు (1 నుంచి 5వ తరగతి వరకు):
అక్టోబర్ 5: తెలుగు (ఉదయం), గణితం (మధ్యాహ్నం).
అక్టోబర్ 6: ఇంగ్లీష్ (ఉదయం), పర్యావరణ శాస్త్రం (మధ్యాహ్నం).
అక్టోబర్ 7: OSSC (ఉదయం).
ఉన్నత ప్రాథమిక, ఉన్నత పాఠశాల తరగతులు (6 నుంచి 10వ తరగతి వరకు):
అక్టోబర్ 5: తెలుగు, గణితం.
అక్టోబర్ 6: హిందీ, జనరల్ సైన్స్ / ఫిజికల్ సైన్స్.
అక్టోబర్ 7: ఇంగ్లీష్, సోషల్ స్టడీస్.
అక్టోబర్ 8: బయోలాజికల్ సైన్స్, OSSC–1, OSSC–2.
సబ్జెక్టుల వారీగా తరగతుల కేటాయింపులు, పరీక్షల సమయాలను అధికారిక షెడ్యూల్ ప్రకారం పాటించాలని అధికారులు సూచించారు.మండలంలోని అన్ని ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని, విద్యార్థులందరూ పరీక్షలకు హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖాధికారులు సుధారాణి, పి. కబీర్ సాబ్ కోరారు.


