చెరువులను నీటి తో నింపే ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి
1 min read
త్రాగు నీటి పనులకు ప్రాముఖ్యత ఇవ్వండి
హెల్త్ క్లినిక్స్ , అంగన్వాడి భవనాలు , సిసి రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయండి
జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి /జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు ,న్యూస్ నేడు : జిల్లాలోని చెరువులను అన్నింటిని నీటితో నింపే ప్రక్రియలు త్వరగా పూర్తి చేయాలని, హెల్త్ క్లినిక్స్ , అంగన్వాడి భవనాలు , సిసి రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయండి అని జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి/జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి /జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరిగే వివిధ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని త్రాగునీటి పనులకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని , వాటికి సంబంధించిన పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. హంద్రీనీవా నీటి ప్రవాహం మరియొక పది రోజులు , ఎల్ఎల్సీ నీటి ప్రవాహం నవంబర్ 10 వ తారీకు వరకు ఉండే అవకాశాలు ఉన్నందున జిల్లాలోని చెరువులను వెంటనే నింపాలని ఆదేశించారు. 35 నీటి చెరువులలో ఇంకా 18 చెరువులు వివిధ నీటి స్థాయి 75 శాతం-11, 50 శాతం -5 మరియు 25 శాతం-2 లలో ఉన్నవని వీటిని కూడా పూర్తిస్థాయిలో నింపడం పూర్తిచేయాలని , అందుకు కావలసిన చర్యలు తీసుకోవాలని , బోర్వెల్ లను లోతుగా డ్రిల్ చేసే పనులను , ఫిల్టర్లను మార్చే ప్రక్రియ మరియు సిసి డ్రైన్స్ ల పనులను వెంటనే పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ మనోహర్ ను ఫోన్ ద్వారా ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అతి ముఖ్యమైన పెండింగ్ పనులు హెల్త్ క్లినిక్స్ , అంగన్వాడి భవనాలు , సిసి రోడ్ల పనులు, టాయిలెట్స్ మొదలగు నవి త్వరగా పూర్తి చేయమని , అందుకు కావలసిన అనుమతులు తీసుకోవాలని , పనులు కూడా కాంట్రాక్టర్లు వెంటనే పూర్తి చేసే చర్యలు తీసుకోవాలని సంబందించిన అధికారులను ఆదేశించారు. జిల్లాకు ఇంకా రావలసిన 15వ ఫైనాన్స్ కమిషన్ మరియు 16వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాబట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో సుధాకర్ రెడ్డి , పంచాయతీరాజ్ ఎస్.ఈ చంద్రా రెడ్డి ,పి.ఆర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివసాగర్ రెడ్డి,ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అబ్దుల్ ఖాదర్, జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ జితేంద్ర , డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీధర్ మూర్తి పాల్గొన్నారు. ఎస్.ఈ. ఆర్డబ్ల్యూఎస్ మనోహర్ టెలికాన్ఫ్రెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.


