NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హార్టికల్చర్ హబ్  మదనపల్లె సభ విజయవంతం కార్యకర్తలకే అంకితం

1 min read

విజయోత్సవ సభలో ఎమ్మెల్యే షాజహాన్ భాష

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి  : లక్ష కోట్ల రూపా యల వ్యయంతో మదనపల్లె కేంద్రంగా హార్టికల్చర్ హబ్ కు శంకుస్థాపన చేయ డానికి  మదనపల్లె లో జరిగిన బహి రంగ సభను విజయ వంతం చేసిన ఘనత పార్టీ శ్రేణులు కార్యకర్తలు దేనిని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ భాషా ప్రకటించారు.ఇందులో బాగంగా శనివారం స్థానిక మిషన్ కాంపౌండ్ సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసినవిజయోత్సవ సభలో ఎమ్మెల్యే   మీడియాతో మాట్లాడుతూ  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న   సభను విజయ వంతం చేసేందుకు లక్ష మంది జనం తరలి రావడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ సభను విజయ వంతం చేసేందుకు తరలివచ్చిన ప్రజలకు ఏర్పాట్లు చేసిన, భాగస్వాము లైన తెలుగుదేశం కార్య కర్తలకు ఈ విజయాన్ని అంకితం చేస్తు న్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ భాషా స్పష్టం చేశారు.మదనపల్లెకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసు కొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అకుంఠిత మైన దీక్షతో లక్ష కోట్ల రూపాయల  పెట్టుబడులను తీసుకొచ్చారని,  పది నెలలకు ముందు మదనపల్లె కేంద్రంగా జిల్లా కేంద్రాన్ని ప్రక టించారని, ఎలినీనో పరిస్థితులతో తీవ్ర వర్షాభావంతో తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్న మదనపల్లె అన్నమయ్య జిల్లా ప్రజలను ఆదుకు నేందుకు హంద్రీ నీవా ద్వారా కృష్ణాజిల్లాలను తీసుకొచ్చి మదనపల్లె ప్రాంత ప్రజలకు గొంతు తడిపిన నేత ముఖ్యమంత్రి చంద్రబాబు  అన్నారు. సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్య వాదాలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగు దేశం పార్టీ నాయకులు నీలకంఠ, మోడెం సిద్ధప్ప, కొత్తపాలెం సుధాకర్, భారతి నాయుడు, తలారి రాధా, మైనార్టీ నాయకులు ఎస్ఎం రఫీ, రాజన్న, రత్న, పులి మహాలక్ష్మి, జ్ఫరున్నిష, రెడ్డి భూ, ఎస్ ఏ మస్తాన్, తిప్పన్న, శ్రీపతి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *