NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మృత్యుంజయుడు ముక్కెరన్న

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: 2018  మార్చి నెలలో 75 సంవత్సరాల దేవనకొండ మండలం ఐరన్ బండకు చెందిన ముక్కెరన్నకు గుండె బైపాస్ ఆపరేషన్ అవసరం అయింది.. అయితే అతనికి వయసు రీత్యా మూడు రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం వలన ఆపరేషన్ చేయడం చాలా కష్టం అని నిర్ధారించడం జరిగింది.. ఎంతో రిస్క్ అయినా కానీ పేషెంట్స్ ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధమయ్యారు.అతి క్లిష్టమైన ఆ బైపాస్ సర్జరీని బీటింగ్ హార్ట్ పద్ధతిలో చేయడం జరిగింది.. ఆపరేషన్ సక్సెస్ అయి పేషంట్ రెండు మూడేళ్లు బతుకుతాడు అని అనుకున్నాం.. కానీ ఆశ్చర్యంగా పేషెంట్ ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈరోజు అనగా 2026 అక్టోబర్ నెలలో మరల ఆసుపత్రికి వచ్చి చాలా బాగున్నాను అని కలిసి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.ఇటువంటి ఎంతోమంది పేద ప్రజలకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సిటీవిఎస్ విభాగంలో బైపాస్ సర్జరీలు జరిగాయి.. దాదాపు 2000 మంది వివిధ రకాల ఆపరేషన్ల తో తమ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు..ప్రభుత్వ ఆసుపత్రులలో ఇలాంటి పెద్ద ఆపరేషన్ చేసే సౌకర్యాలు ఉండడం వలన బీదలు కూడా ఈ ఆపరేషన్లు చేయించుకొని చాలా రోజులు బ్రతకడానికి అవకాశం కలుగుతుంది కేవలం ప్రైవేట్ ఆసుపత్రుల పైనే ఆధారపడకుండా గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా బాగా డెవలప్ అయితేనే ఇటువంటిది పేదలకు ఫలితాలు అందుతాయి..ఇలా 83 సంవత్సరాలు బ్రతకడం అనేది చాలా మంచి విషయం.. పేద ప్రజలకు సంజీవని లాంటి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఇంకా ముందు ముందు మంచి సేవలు అందిస్తుంది..డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *