ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు
1 min read
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలూరు ఎమ్మెల్యే కుటుంబం
ఎమ్మెల్యే వెంట పాల్గొన్న కుటుంబ సభ్యులు, యువ నాయకులు, వైఎస్సార్సీపీ శ్రేణులు
ఆలూరున్యూస్ నేడు: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు బుసినే విరుపాక్షి తన కుటుంబ సభ్యులు, యువ నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.మంగళవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి కుటుంబ సభ్యులు ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సతీమణి బుసినే రామాంజినమ్మ, ఆయన సోదరుడు బుసినే శ్రీరాములు, యువ నాయకులు బుసినే లక్ష్మీనారాయణ, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బుసినే చంద్రశేఖర్, బుసినే మధుసూదన్, బుసినే మారుతి పాల్గొన్నారు.



