NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

12 నుంచి 17 వరకు రైతు సేవా కేంద్రాల్లో ఉద్యానవన వారోత్సవాలు

1 min read

అక్టోబర్ 12 నుంచి 17 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు

కర్నూలు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రాజా కృష్ణారెడ్డి

కర్నూలు , న్యూస్​ నేడు : సమగ్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్- రాయలసీమ రైజింగ్ కార్యక్రమం క్రింద కర్నూలు జిల్లాలో 2026 అక్టోబర్ 12 నుంచి 17వ తేదీ వరకు అన్ని రైతు సేవా కేంద్రాల్లో (RSKలు) ఉద్యానవన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యానవన రైతులకు నాణ్యమైన విత్తనాలు, మొక్కల ఎంపిక నుంచి పంటల సాగు, ఉత్పాదకత పెంపు, నాణ్యత మెరుగుదల, మార్కెటింగ్, ప్రాసెసింగ్ మరియు ఎగుమతుల వరకు అందుబాటులో ఉన్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం, పండ్ల తోటల్లో ఉత్పాదకతను పెంచడం, నాణ్యమైన దిగుబడులు సాధించడం, సూక్ష్మసేద్యంతో పాటు ఆటోమేషన్ పద్ధతులను ప్రోత్సహించడం, ఉద్యాన యాంత్రీకరణను విస్తరించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలు, అదేవిధంగా, పంట కోత అనంతర నష్టాలను తగ్గించేందుకు ఉత్పత్తుల సేకరణ, నిల్వ, శుద్ధి, గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల (FPOలు) బలోపేతం, మార్కెటింగ్ సదుపాయాల కల్పనపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.గ్లోబల్ హార్టికల్చర్ హబ్• • ద్వారా ఉద్యానవన రంగాన్ని మరింత లాభదాయకంగా మార్చడం, రైతులఆదాయాన్ని పెంచడం, పంటలకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయనుంది.కావున, ఉద్యానవన పంటలు సాగు చేస్తున్న మరియు సాగు చేయడానికి ఆసక్తి ఉన్న రైతులు తమ గ్రామాలకు సంబంధించిన రైతు సేవా కేంద్రాల్లోని (RSK) సిబ్బందిని సంప్రదించి, అందుబాటులో ఉన్న పథకాలు మరియు వాటి ప్రయోజనాలపై వివరాలు తెలుసుకొని, సంబంధిత భాగాల కింద ప్రయోజనాలు పొందేందుకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లాఉద్యాన శాఖ అధికారికోరుతున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *