NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేవరగట్టు బన్నీ ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష

1 min read

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు చేపట్టాలి

వైద్య, రహదారులు, విద్యుత్, పంచాయతీ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం

హొళగుంద న్యూస్ నేడు: దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవాలను పురస్కరించుకుని ఈరోజు దేవరగట్టులో పండుగ ఏర్పాట్లను సంబంధిత అధికారులు పరిశీలించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంపై చర్చించారు.ఈ కార్యక్రమంలో హొళగుంద పోలీస్ స్టేషన్ ఎస్సై దిలీప్ కుమార్, హొళగుంద తహసీల్దార్ లక్ష్మీరాజుతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ), రహదారులు మరియు భవనాల శాఖ అధికారులు, ఇతర వైద్యాధికారులు, స్థానిక విద్యుత్ శాఖ ఏఈ, పంచాయతీ సిబ్బందితో కలిసి ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *