“విపత్తులను తట్టుకునే సామర్థ్యం మన ఇంటి నుంచే ప్రారంబించాలి
1 min read
కర్నూలు,న్యూస్ నేడు: మై భారత్ కేంద్ర, భారత ప్రభుత్వ క్రీడల మంత్రిత్వ శాఖ, కర్నూలు ఆధ్వర్యంలో అంతర్జాతీయ విపత్తుల ప్రమాదాల తగ్గింపు దినోత్సవం ను పురస్కరించుకొని స్థానిక జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించడమైనది. ఈ సందర్బంగా కర్నూలు మై భారత్ కేంద్ర జిల్లా యువజన అధికారి శ్రీ టి.ఐజయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 13వ తేదీన అంతర్జాతీయ విపత్తుల ప్రమాదాల తగ్గింపు దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారాని, ఈరోజున విపత్తుల వల్ల సంభవించే ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించడం, ప్రజల్లో విపత్తుల పట్ల అవగాహన పెంపొందించడం, విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యాలని తెలిపారు. తదుపరి ఏ.పి స్పెషల్ పోలీస్ విభాగం డి.ఎస్.పి శ్రీ మహబూబ్ బాషా గారు మాట్లాడుతూ అంతర్జాతీయ విపత్తుల ప్రమాదాల తగ్గింపు దినోత్సవం 2026 సంవత్సరపు థీమ్: “Resilience Starts at Home” అని అంటే “విపత్తులను తట్టుకునే సామర్థ్యం మన ఇంటి నుంచే ప్రారంబించాలి” అని విపత్తులను తట్టుకునే సామర్థ్యం ప్రతి కుటుంబం, ప్రతి ఇల్లు నుంచే ప్రారంభం కావాలని థీమ్:తెలియజేస్తుందని, ప్రతి ఇంట్లో ప్రథమ చికిత్స కిట్, టార్చ్‌లైట్, అవసరమైన మందులు, తాగునీరు, అత్యవసర ఆహార పదార్థాలు సిద్ధంగా ఉంచుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన అధికారుల ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. తదుపరి అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వై.చిన్న బజారి గారు గారు మాట్లాడుతూ విపత్తుల పట్ల ప్రతి ఒక్కరికి ముందస్తు అవగాహన ఉండాలని భారతదేశంలో వరదలు, తుఫానులు, వడగాలులు, కరువు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు వంటి విపత్తులు వివిధ ప్రాంతాల్లో సంభవించే అవకాశం ఉందని . విపత్తులు సంభవించిన తరువాత సహాయక చర్యలు చేపట్టడంతో పాటు, ముందుగానే ప్రమాదాలను గుర్తించి నష్టాలను నివారించడానికి చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యం అని, వరదలు లేదా తుఫానుల హెచ్చరికలు వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారుల సూచనలను పాటించాలని, విపత్తుల గురించి ముందస్తు హెచ్చరికలు అందినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదని, విద్యుత్ పరికరాలు, గ్యాస్ సిలిండర్లు, భవన నిర్మాణ భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు సబ్ ఇన్స్పెక్టర్ డి.అలీ బాబా మాట్లాడుతూ విపత్తుల నిర్వహణలో యువత, విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, ప్రమాదాలు, విపత్తులు సంబవించినపుడు వృద్ధులు, చిన్నపిల్లలు, దివ్యాంగులు, గర్భిణులు వంటి వారికి ప్రత్యేక సహాయం అందేలా యువత ముందుండాలని కోరారు. ..తదుపరి డిసాస్టర్ మెనేజిమెంట్ ట్రైనర్ శ్రీమతి శాంత కుమారి మరియు అగ్ని మాపక విభాగ సిబ్బంది విపత్తులు, వరదలు మొదలగునవి సంభవించినపుడు ఎటువంటి చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలి అని అవగాహనా కల్పించారు .ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, కళాశాల స్టూడెంట్స్ కార్యకలాపాల డీన్ శ్రీ జి.శశి కుమార్ గారు, కళాశాల ఎన్.ఎన్.యెస్ అధికారి శంకర ప్రసాద్ మరియు అగ్ని మాపక విభాగ సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.


