NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఆవిర్భావ దినోత్సవం

1 min read

మదనపల్లె న్యూస్ నేడు ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 1984 అక్టోబర్ 13వ తేదీన నిర్భవించింది. ఈ సంఘం స్థాపనకు నడుం బిగించి ముందు నిలిచి ప్రముఖ పాత్ర వహించిన బషీరుద్దీన్ అహ్మద్, పి పద్మారావు,కె భుజం రెడ్డి , వి శరవనం రామ్మూర్తి లు చిరస్మరణీ యులు. మంగళవారం అన్నమయ్య జిల్లా కేంద్రం  మదనపల్లె లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని సభ్యులు హాజరై ఘనంగా జరుపు కున్నారు. స్థానిక  జి ఆర్ టి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజ గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి శంకరయ్య ఆధ్వర్యంలో  పతాకాన్ని  ఎగుర వేశారు. ఈ కార్యక్రమానికి మదనపల్లె యూనిట్ అధ్యక్షులు బివి రమణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ ముని గోపాల కృష్ణ, ట్రెజరర్ తిమ్మయ్య, అసోసియేట్  ప్రెసిడెంట్ శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్ మురళి, కేశవరెడ్డి, మహిళా ప్రతినిధులు  శకుంతలమ్మ,  ధనలక్ష్మి, జాయింట్ సెక్రెటరీ జగన్మో హన్, శివప్రసాద్  రాయచోటి, పుంగనూరు, కలికిరి, వాయ ల్పాడు, గుర్రంకొండ, మదనపల్లి, పీలేరు  యూనిట్ సభ్యులు హాజరు కావడం జరిగింది. ఈ  సందర్భంలో అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శంకరయ్య  ఇటీవల రాష్ట్ర ఎన్నికలలో రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్ను కోబడ్డారు.మదనపల్లె యూనిట్ ప్రధాన కార్యదర్శి డా. ముని గోపాల కృష్ణ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా శంకరయ్య  కు రావడం వలన  జిల్లా సమస్యలను రాష్ట్రస్థాయిలో తెలియజేసి మన సమస్యల పరిష్కారానికి అండగా ఉంటారని పేర్కొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *