NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పలు మద్యం దుకాణాలలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు

1 min read

టి.నరసాపురం మండలంలో 300 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం

8 లీటర్లు నాటు సారాయి స్వాధీనం,సదరు వ్యక్తిపై పరారీ కేసు నమోదు

చింతలపూడి ఇంచార్జ్ ఎక్సైజ్ సి.ఐ.అబ్దుల్ ఖలీల్,స్టేషన్ ఎస్.ఐ.  జె.జగ్గారావు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్, ఏలూరు బి.శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ (ఎన్‌ఫోర్స్‌మెంట్), ఏలూరు కె.వి.ఎన్. ప్రభు కుమార్ మరియు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి, ఏలూరు జిల్లా ఏ. ఆవులయ్య ఆదేశాల ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ సిఐ వైవిఎన్ఎస్ ఫణి కుమార్ మరియు ఈ ఎస్ టి ఎఫ్ సి ఐ ఆర్ సత్యవతి మరియు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది కలిసి ఎక్సైజ్ నేరంముల కొరకు జాయింట్ రైట్స్ నిర్వహించగా టి. నరసాపురం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన మాలోతు శ్రీను అను వ్యక్తికి సంబంధించిన నాటు సారాయి తయారీకి పనికి వచ్చు 300 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి (08) లీటర్లు నాటు సారాయిని స్వాదినపరుచుకుని ఆ వ్యక్తిపై పరారీ కేసు నమోదు చేయడమైనదని,అలాగే ఈరోజు టీ నర్సాపురం మండలంలో గల అనగాని రాంబాబు, కామన వీర్రాజు మరియు భూక్య రాములు అను ముగ్గురం టీ నర్సాపురం మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వారి వద్ద హాజరుపరచగా 129 బి ఎన్ ఎస్ ఎస్ చట్ట ప్రకారం బైండోవర్ బాండ్ విధించినారు.అలాగే గురువారం  టి.నరసాపురం  మండలం లో గల పలు మద్యం దుకాణాలలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మద్యం స్టాక్ ​ఎక్సైజ్ డిపో (APSBCL) నుండి వచ్చిన హోలోగ్రామ్/క్యూఆర్ కోడ్‌ లను కొన్ని మద్యం సీసాలు ఏ.పి.సురక్ష ఆన్లైన్ యాప్ ద్వారా సాధారణంగా పరిశీలించి ,  మద్యం అమ్మకాలు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం జరపాలని సూచనలు ఉల్లంఘించరాదని,  సక్రమముగా పూర్తి నియమాలు/ చట్టాలు పాటించవలసినదిగా మద్యం షాపులోని సేల్స్ సిబ్బందికి తెలిపినారు.ఈ దాడులలో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్.ఐ.  జె.జగ్గారావు మరియు సిబ్బంది పాల్గొన్నారని ఇంచార్జ్ ఎక్సైజ్ సి.ఐ.అబ్దుల్ ఖలీల్ తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *