ఆల్కెమ్ కంపెనీ..రైతులకు పవర్ స్ప్రేయర్లు
1 min read
2 లక్షల 20 వేలు విలువ చేసే స్ప్రేయర్లు పంపిణీ
కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ మాలిక్..మిడుతూరు న్యూస్ నేడు: రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రైతులు బాగుంటేనే గ్రామం బాగుంటుందని ఆల్కెమ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ మాలిక్ అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు- నందికొట్కూరు దారి మధ్యలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ఎదురుగా నున్న వలి టొబాకో ట్రేడర్స్ దగ్గర గురువారం కంపెనీ ఆధ్వర్యంలో పొగాకు పంటల వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనల గురించి రైతులకు అవగాహన కల్పించారు అదేవిధంగా మాసపేట ఉప్పలదడియ కలమందలపాడు వడ్డెమాను కడుమూరు చౌటుకూరు,గార్గేయపురం గ్రామాల్లో ఉన్న 51 మందికి పవర్ స్ప్రేయర్లను పంపిణీ చేశారు.మొత్తం 2లక్షల 20వేల విలువ చేసే స్ప్రేయర్లను కంపెనీ రైతులకు అందజేసింది. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మరియు జనరల్ మేనేజర్ సునీల్ ద్వివేదీ,మాజీ జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి స్ప్రేయర్లను అందజేశారు. ఉచితంగా స్ప్రేయర్లు అందజేయడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ కంపెనీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు అండగా ఉంటామని అదేవిధంగా గ్రామాల్లో బాలికలకు చిన్న వయసులో బాల్యవివాహాలు చేయకూడదని,పొలాల్లో మహిళలకు తీసుకోవాల్సిన రక్షణ గురించి సునీల్ మాలిక్ అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కంపెనీ చైన్ మేనేజర్ యువరాజ్, ఏరియా ఇన్చార్జి కే అరుణ్ కుమార్,మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి,వలి టొబాకో అధినేత వలిభాష, అబ్దుల్ సలాం,షేక్ రఫీ, అన్వర్ భాష,జ్ఞానేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వడ్డెమాను సత్యం రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి,రవి రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.



