NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సర్పంచ్ లు, గ్రామ వార్డ్ మెంబెర్స్ పదవులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు

1 min read

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లాలోని 542 గ్రామ పంచాయతీలకు సంబంధించి  542 సర్పంచ్ లు,5676 గ్రామ వార్డ్ మెంబెర్స్ పదవులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలియజేసారు.

గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు రిజర్వేషన్లు

జిల్లాలోని 542 గ్రామ పంచాయతీలకు సంబంధించి మహిళలకు 266 స్థానాలు, జనరల్ కు 276 స్థానాలు కేటాయించారు. వాటిలో   షెడ్యూల్డ్ ఏరియాలోని 63 స్థానాలకుగాను మహిళలకు 31 స్థానాలు , జనరల్ కు 32 స్థానాలు , 100 శాతం షెడ్యూల్డ్ తెగల తండాలు కలిగిన 2 ఎస్టీ పంచాయతీలలో ఒకటి మహిళలకు, ఒకటి జనరల్ కు కేటాయించినట్లు చెప్పారు. అదేవిధంగా నాన్ -షెడ్యూల్డ్ ప్రాంతాలలోని  479 స్థానాలకు సంబంధించి షెడ్యూల్డ్ తెగలకు 6 స్థానాలకు గాను 2 మహిళలకు, 4 జనరల్ కు, షెడ్యూల్డ్ కులాలలకు 121 స్థానాలకు గాను 56 మహిళలకు, 65 జనరల్ కు, వెనుకబడిన తరగతులకు 104 స్థానాలకు గాను 52 మహిళలకు, 52 జనరల్ కు,   రిజర్వు కాని కేటగిరీకి  246 స్థానాలకు గాను 124 మహిళలకు, 122 జనరల్ కు కేటాయించినట్లు చెప్పారు.

వార్డ్ మెంబెర్స్ స్థానాలకు రిజర్వేషన్లు

జిల్లాలోని 5676 వార్డ్ మెంబర్ల స్థానాలకు  సంబంధించి   షెడ్యూల్డ్ ఏరియాలోని 63 గ్రామ పంచాయతీలలోని  626 వార్డ్ మెంబర్ల  స్థానాలకుగాను మహిళలకు 313 స్థానాలు , జనరల్ కు 313 స్థానాలు కేటాయించారు.    షెడ్యూల్డ్ కులాలకు  403 స్థానాలకు గాను 187 స్థానాలు మహిళలకు, 216 స్థానాలు జనరల్ కు కేటాయించారు. రిజర్వు కాని కేటగిరీకి సంబంధించి  223  స్థానాలకు గాను 126 మహిళలకు, 97 జనరల్ కు కేటాయించినట్లు చెప్పారు.నాన్ షెడ్యూల్డ్ ఏరియాలోని 479 గ్రామ పంచాయతీలలోని  5050 వార్డ్ మెంబర్ల  స్థానాలకుగాను మహిళలకు 2525 స్థానాలు , జనరల్ కు 2525 స్థానాలు కేటాయించారు.  షెడ్యూల్డ్ తెగలకు 92 స్థానాలకు గాను 37 మహిళలలకు, 55 జనరల్ కు కేటాయించారు.    షెడ్యూల్డ్ కులాలకు  1289 స్థానాలకు గాను 560   స్థానాలు మహిళలకు, 729  స్థానాలు జనరల్ కు కేటాయించారు.  వెనుకబడిన తరగతులకు సంబంధించి 1099 స్థానాలకు గాను 521 మహిళలకు , 574 జనరల్ కు కేటాయించారు.  రిజర్వు కాని కేటగిరీకి సంబంధించి  2570 స్థానాలకు గాను 1407 మహిళలకు, 1163 స్థానాలు జనరల్ కు కేటాయించినట్లు కలెక్టర్ తెలియజేసారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *