NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిరప పంట చేతికొచ్చింది పంట తొలగించొద్దు

1 min read

హోళగుంద న్యూస్ నేడు : మిరప పంట దిగుబడి కి సిద్ధమయింది పంటను తొలగించవద్దు అంటూ కౌలు రైతు ధనుంజయ సంబంధిత గాలి మరల సంస్థను కోరుతున్నాడు. ఈ సందర్భంగా కౌలు రైతు వివరాలు వెల్లడిస్తూ 5 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకోని మిరప పంటను సాగు చేసుకోవడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం పొలాల్లో బ్యాడిగి మిరప పంట దిగుబడికి సిద్ధంగా ఉందని, ఈ సమయంలో పొలాలను ఖాళీ చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పంట సాగు కోసం ఇప్పటికే  లక్షల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టామని, మరికొద్ది రోజుల్లో పంటను కోసి దిగుబడిని ఇంటికి చేర్చుకునే అవకాశం ఉందని రైతు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో విండ్ పవర్ ఫ్యాన్ల ఏర్పాటుకు సంబంధించి పొలాలను వెంటనే ఖాళీ చేయాలని కోరడం తమకు ఇబ్బందికరంగా మారిందని బాధిత కౌలు రైతు అంటున్నాడు.తమ కష్టాన్ని గుర్తించి కంపెనీ ప్రతినిధులు మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరుతూ కరువు పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని పంటను పండించుకోవడం జరిగిందని అవకాశం కల్పించి పంట కోతకు వరకు గడువు అందించాలని రైతు వాపోయాడు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *