NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎంపీటీసీ ఎన్నికలలో చివరి రోజు 42 నామినేషన్లు దాఖలు

1 min read

కౌతాళంలో నామినేషన్ల సందడి

నామినేషన్ పత్రాలు మూడు రోజులు మొత్తం కలిపి  85

కౌతాళం న్యూస్ నేడు, : మండల కేంద్రమైన మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో నామినేషన్ కేంద్రం వద్ద సందడి నెలకొంది.వైసీపీ, టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు రావడంతో నాయకులు, కార్యకర్తలతో కేంద్రం వద్ద ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. అభ్యర్థులకు మద్దతుగా పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా హసీనా, అవతారం, డింగి రామకృష్ణ మరియు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా భీమేష్, ఉరుకుంద తిమ్మక్క, ఉప్పరహాల్ రంగప్ప ఎంపీటీసీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను మండల రిటర్నింగ్ అధికారి రంగస్వామి గారికి అధికారికంగా సమర్పించారు.మండలం మొత్తం మూడు రోజుల్లో దాఖలైన నామినేషన్ల వివరాలు

టీడీపీ – 40

వైఎస్ఆర్ సీపీ – 42

జనసేన – 2

సీపీఐ – 1

మొత్తం – 85 నామినేషన్లు దాఖలుతో కౌతాళం మండలంలో ఎన్నికల సందడి నెలకొంది. ఎట్టకేలకు నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *