NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్యాపిలిలో ప్రశాంతంగా ఎంపీటీసీ నామినేషన్లు

1 min read

21 స్థానాలకు 36 నామినేషన్లు.. టీడీపీ నుంచి 21, వైఎస్సార్‌సీపీ నుంచి 8

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాలకు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు మొత్తం 36 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మండలంలో ఎన్నికల సందడి నెలకొంది.

పార్టీల వారీగా నామినేషన్లు ఇలా..

మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం నాటికి మొత్తం 36 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుంచి 21, జనసేన పార్టీ నుంచి 6, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) నుంచి 8, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి ఒక నామినేషన్ దాఖలైనట్లు తెలిపారు.

ఎంపీడీవో కార్యాలయం వద్ద గట్టి పోలీసు బందోబస్తు

నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు నాగార్జున, అనిల్ కుమార్ పోలీసు సిబ్బందితో కలిసి భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నామినేషన్ల దాఖలుతో మండలంలో స్థానిక రాజకీయాలు మరింత వేడెక్కాయి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *