కూటమి అభ్యర్థుల అందరిని అఖండ మెజార్టీతో గెలిపించండి
1 min read
మమ్మల్ని ప్రోత్సహించి ఆదరిస్తున్న ఓటర్లoదరికీ కృతజ్ఞతలు
మండల జడ్పిటిసి,ఎంపిటిసి అభ్యర్థులు
ప్రచారంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు, కూటమి నాయకులు, అభిమానులు కార్యకర్తలు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా లింగపాలెం మండల జడ్పిటిసి అభ్యర్థినిగా ముసునూరి సరోజినీ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా గెలుపుకు కృషి చేస్తున్నారు, ఈ సందర్భంగా జడ్పిటిసి అభ్యర్థిని మాట్లాడుతూ నన్ను జెడ్పిటిసి అభ్యర్థినిగా గ్రామ ప్రజలు ఎన్నుకోవడం జరిగిందని నన్ను అఖండ మెజార్టీతో గెలిపించి మండలంలోని ఉన్న ఎంపీటీసీలను మొత్తాన్ని గెలిపించలని కోరారు. రంగాపురం ఎంపీటీసీ బొంతు రాణి మాట్లాడుతూ నన్ను మీ అందరి సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. టిడిపి నాయకులు మాట్లాడుతూ ముసునూరు సరోజినీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జడ్పిటిసి అభ్యర్థినిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యే,ఎంపీ,గ్రామ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపారు. గెలిపించాలని కోరుచున్నాము సరోజిని కూడా అఖండ విజయంతో గెలిపిస్తారని కోరుచున్నమన్నారు. గ్రామ పార్టీ అధ్యక్షులు శేషగిరిరావు, జనసేన పార్టీ నాయకులు గోపి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు కూటమి నాయకులు అభిమానులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.


