NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మీ అందరి సహకారంతో శక్తివంచన లేకుండా డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా

1 min read

51వ డివిజన్ కూటమి టిడిపి అభ్యర్థి చౌటపల్లి శ్రీనివాసరావు

ప్రచారం లో పాల్గన్న పార్టీ శ్రేణులు,అభిమానులు శ్రేయోభిలాషులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: 51వ డివిజన్ టిడిపి బిజెపి జనసేన బలపరిచిన కూటమి పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా చౌటపల్లి  శ్రీనివాసరావు ప్రచారంలో కొనసాగుతున్నారు. స్థానిక డివిజన్ నుంచి పార్టీ శ్రేణులు కార్యకర్తలు,అభిమానులు, కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులతో ప్రచారం కొనసాగిస్తూ, ఒక్కసారి అవకాశం ఇచ్చే గెలిపించాలని అభివృద్ధికి ఓటేయాలని డివిజన్ ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  టిడిపి బలపరిచిన అభ్యర్థిగా  సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో.ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ప్రోత్సాహంతో 51వ డివిజన్ నుండి విజయం సాధించి టి డి పి, పార్టీకి, డివిజన్ ఓటర్లు కి బహుమతిగా ఇస్తానని, మీ అందరి సహకారంతోనే డివిజన్ ని అభివృద్ధి చేసి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని అన్నారు. అదేవిధంగా స్థానిక డివిజన్ లో తనకు మంచి ప్రోత్సాహం ఓటర్లు అందిస్తున్నారని ఓటర్ల సహకారంతోటే ఈ విజయాన్ని సాధిస్తానని శ్రీనివారావు భీమా వ్యక్తం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *