15వ వార్డులో వైసీపీకి షాక్
1 min read
టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కూతురు
కర్నూలు న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని 15వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి జలీల్ అహ్మద్ కుమార్తె ఆలియా బేగం తన భర్తతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో ఆయన సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని టీడీపీలో చేరగా, మంత్రి వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆలియా బేగం తెలిపారు. రానున్న కార్పొరేటర్ ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయడంతో పాటు పార్టీ బలోపేతానికి తన వంతు సహకారం అందిస్తానని ఆమె పేర్కొన్నారు.


