మీ అందరి సహకారంతో శక్తివంచన లేకుండా 34 డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా
1 min read
వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ బలపరిచిన సిపిఐ(యం) కార్పొరేటర్ అభ్యర్థి యర్రా రాంబాబు
ప్రచారంలో పాల్గన్న సీపీయం పార్టీ శ్రేణులు,వైసీపీ నాయకులు,అభిమానులు శ్రేయోభిలాషులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వై ఎస్ ఆర్ కాంగ్రస్ పార్టీ బలపరిచిన సిపిఐ(యం)34వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి యర్రా రాంబాబు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రచారం కొనసాగుతున్నారు. స్థానిక డివిజన్ నుంచి సి పి యం పార్టీ నాయకులు,వై సి పి శ్రేణులు, కార్యకర్తలు,అభిమానులు, కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులతో ప్రచారం కొనసాగిస్తూ, ఒక్కసారి అవకాశం ఇచ్చే గెలిపించాలని అభివృద్ధికి ఓటేయాలని డివిజన్ ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వై సి పి బలపరిచిన పార్టీ అభ్యర్థిగా మాజీ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోఏలూరు నియోజకవర్గ కన్వీనర్ మామిళ్ళపల్లి జయప్రకాష్ (జెపి) ప్రోత్సాహంతో 34వ డివిజన్ నుండి పోటీ చేస్తున్నానన్నారు.బలపరిచిన పార్టీల ఆశీస్సులతో విజయం సాధించి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి,సిపిఐ(యం) కి,డివిజన్ ఓటర్లు కి బహుమతిగా ఇస్తానని,మీ అందరి సహకారంతోనే డివిజన్ లో స్వచ్ఛమైన త్రాగునీరు,డివిజన్ అంతట వీధి దీపాలు,డ్రైనేజీ సౌకర్యాలు,పక్క సిసి రోడ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సువిశాలమైన పార్కులు మరింత మౌలిక సదుపాయాలను తీసుకురావడానికి కృషితో ,అభివృద్ధి చేసి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని అన్నారు. అదేవిధంగా స్థానిక డివిజన్ లో తనకు మంచి ప్రోత్సాహం ఓటర్లు అందిస్తున్నారని ఓటర్ల సహకారంతోటే సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుతో,ఈ విజయాన్ని సాధిస్తానని యర్రా రాంబాబు భీమా వ్యక్తం చేశారు.


