సమాజంలో అవినీతి రూపుమాపడం ప్రతీ ఒక్కరి బాధ్యత
1 min read
అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ జి.వి. కృష్ణారావు
అవినీతి నిరోధక కార్యాలయంలో
పాత్రికేయుల సమావేశం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సమాజంలో అవినీతి రూపుమాపడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ జి.వి. కృష్ణారావు చెప్పారు. స్థానిక అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ విజిలెన్స్ వారోత్సవాలలో భాగంగా సమాజంలో అవినీతిని రూపుమాపడం కోసం అవినీతి నిరోధక శాఖ కళాశాలల స్థాయిలో విద్యార్థులకు, ప్రభుత్వ కార్యాలయాలలోను , వివిధ రంగాలలోని ప్రజలకు విస్తృత అవగాహనకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు. ప్రజలకు కరపత్రాల ద్వారా ప్రముఖ కూడళ్లలో గోడ పత్రికల ద్వారా అవగాహన నిర్వహిస్తున్నామన్నారు. సమాజంలో అవినీతిని రూపుమాపడం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాలలో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా 9440446157, 9440446158, 9440446159 ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదీదారుని వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయ ప్రతినిధులతో అవినీతి నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. అవినీతి నిరోధక శాఖ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసు, సిబ్బంది, పాల్గొన్నారు.


