ఓట్ల లెక్కింపు ప్రక్రియలో చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా విధులు నిర్వర్తించాలి…
1 min read
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులకు ఆదేశం
కౌంటింగ్ సూపెర్వైజర్లు, కౌంటింగ్ సిబ్బందికి ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ తో కలిసి సిబ్బందికి అవగాహన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా సిబ్బంది విధులు నిర్వర్తించేలా శిక్షణ అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.స్థానిక సర్. సి. ఆర్. రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల లో శుక్రవారం కౌంటింగ్ సూపెర్వైజర్లు, కౌంటింగ్ సిబ్బందికి ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ తో కలిసి సిబ్బందికి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ సీల్ తెరవడం, ఓట్ల లెక్కింపు, ఓట్ల చెల్లుబాటు పరిశీలన , తదితర అంశాలపై స్వయంగా అవగాహన కలిగించారు . ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కార్యక్రమంను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని, సిబ్బంది అందరూ మాస్టర్ ట్రైనర్లు అందించే శిక్షణను క్షుణ్ణంగా అర్ధం చేసుకుని ఎక్కడా ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా కౌంటింగ్ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. ఓటు చెల్లుబాటుపై కౌంటింగ్ సూపెర్వైజర్, ఆఫీసర్ కి సమస్య ఎదురైతే వెంటనే రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలన్నారు. కౌంటింగ్ కేంద్రాలలో సిబ్బందికి అవసరమైన వస్తువులు అధికారులు అందుబాటులో ఉంచుతారని, సిబ్బందికి ఎటువంటి వస్తువులను, సెల్ ఫోన్లను కౌంటింగ్ కేంద్రంలోని అనుమతించారని, వాటిని కౌంటింగ్ సెంటర్ బయట ప్రత్యేక కేంద్రంలో ఉంచాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ప్రతీ అంశాన్ని కౌంటింగ్ ఏజెంట్లు పరిశీలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించడం జరుగుతుందని, అనంతరం బ్యాలెట్ బాక్సులలో ఓట్లను ఎన్నికల కమిషన్ నిబందనల ప్రకారం లెక్కించాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ల భద్రత, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్ల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారు లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాలలో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం కౌంటింగ్ హాల్స్, టేబుల్స్ ఏర్పాటు, తదితర ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ . భానుప్రతాప్, కౌంటింగ్ అధికారులు, సూపెర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


