చనుగొండ్లలో ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
1 min read
గూడూరు, న్యూస్ నేడు: గూడూరు మండలం, చనుగొండ్ల గ్రామంలోని శ్రీ మారెమ్మ దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలతో అత్యంత భక్తిశ్రద్దలతో ముగిశాయి. మూడు రోజులపాటు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై డి. జగదీశ్ చేసిన ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలి చేసిన భజన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, స్థానిక భజన మండలి సభ్యులు నారాయణ, కోటేశ్వరయ్య, నాగేశ్వరయ్య, చిన్న మాదన్న, సురేశ్, చిన్న గోకారమయ్య, సూర్య నారాయణ, నడిపి బడేషా, గోవిందు, సమాదయ్య, కృష్ణమూర్తి, వెంకటరాముడు, మాధవస్వామితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



