NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరుజిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ గా (ఏపిడబ్యూజె ఎఫ్) యకులు కె.బాలశౌరి ఏకగ్రీవ ఎన్నిక

1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపిడబ్యూజె ఎఫ్) మరియు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ జర్నలిస్ట్(ఎన్ఎజె) ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏలూరు జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ ఓ) గా యూనియన్ సీనియర్ నాయకులు కె.బాలశౌరి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.శుక్రవారం ఏలూరు రెవెన్యూ భవన్ లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్భంగా ఏ పి డబ్యూ జె ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.డి జబీర్,వై.వి హరీష్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న  ఏ పి డబ్యూ జె ఎఫ్ ఏలూరు జిల్లా, ఎన్ ఎ జె రాష్ట్ర, నేషనల్  ఎన్నికలకు రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుండి రిటర్నింగ్ ఆఫీసర్లను ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే ఏలూరు జిల్లాకు బాలశౌరి ని ఎన్నుకోవడం జరిగిందన్నారు.కొత్తగా ఎన్నికైన రిటర్నింగ్ ఆఫీసర్ కె. బాలశౌరి మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కె.సోమశేఖర్.యర్రా.జయదాసుపి కళ్యాణ్ కుమార్.సిహెచ్ ప్రతాప్.ఎస్ రిషిరావు.టి వెంకటరావు. కే వై దాస్.మిల్ట్రీ ప్రతాప్ సతీష్ కుమార్.మౌనిక. సన్నీ.సామ్యూల్. సుధాకర్. దొరబాబు.జిల్లా నాయకులు,సభ్యులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *