ప్రచారంలో దూసుకుపోతున్న సీపీఐ ఎంపీటీసీ, వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు
1 min read
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ మండలంలో సిపిఐ ఎంపీటీసీ, వైసిపి జెడ్పిటిసి అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.పత్తికొండ పట్టణంలో శుక్రవారం సీపీఐ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. స్థానిక కుమ్మరి వీధి నుంచి ప్రారంభమైన ప్రచారం పట్టణంలోని వివిధ కాలనీల్లో కొనసాగింది.ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పత్తికొండ మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, సీపీఐ మండల కార్యదర్శి యు. కారుమంచి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీపీఐ తరఫున పోటీ చేస్తున్న 6వ ఎంపీటీసీ అభ్యర్థి జి. నెట్టికంటయ్య, 7వ ఎంపీటీసీ అభ్యర్థి వాకిటి కవిత, వైసీపీ తరఫున పోటీ చేస్తున్న జెడ్పీటీసీ అభ్యర్థి సి. శ్రీరంగడు ప్రజలను కలిసి తమకు ఒక్క అవకాశం కల్పించాలని అభివృద్ధి చేసి చూపిస్తామని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.ప్రజా సమస్యలపై అవగాహన కలిగి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థులకు అవకాశం కల్పించాలని, పత్తికొండ పట్టణ అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తామని ఓటర్లకు భరోసా కల్పిస్తున్నారు.ఈ కార్యక్రమంలో పత్తికొండ మాజీ సర్పంచ్ సోమశేఖర్, సీపీఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎం. కృష్ణయ్య, సీపీఐ జిల్లా సమితి సభ్యులు సురేంద్ర, గురుదాస్, కారన్న, ఈరన్న, వెంకట్రాముడు, మండల సహాయ కార్యదర్శి జె. కాశీం, ప్రజాసంఘాల నాయకులు వెంకట్రాంరెడ్డి, రంగన్న, ఉరుకుందు, సిద్ధు, ఉపేంద్ర, ఎం.కె. సుంకన్న, పెద్దముని, మాదన్న, శాఖ కార్యదర్శులు నాగేంద్రయ్య, రవి, పందికోన రవి, దస్తగిరి, హమాలీ నాయకులు రాజేష్, రామంజి, తదితరులు పాల్గొన్నారు.


