జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి..
1 min read
APWJF జిల్లా ప్రధాన కార్యదర్శి T.G.ప్రసాద్ డిమాండ్…
దాడుల నివారణ కమిటీ ని వెంటనే ఏర్పాటు చేయాలి.
ఆదోని లో APWJF నిరసన
నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా ఆత్మకూరు సాక్షి రూరల్ రిపోర్టర్ సుబ్బారెడ్డి పై జరిగిన దాడికి నిరసనగా APWJF ఆదోని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF) జిల్లా ప్రధాన కార్యదర్శి T.G ప్రసాద్ మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు సాక్షి రూరల్ రిపోర్టర్ సుబ్బారెడ్డి పై దాడి చేసిన దుండగులను గుర్తించి అరెస్ట్ చేయాలని అలాగే కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్రంలో, జిల్లాలలో జర్నలిస్టుల పై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని జర్నలిస్టుల కు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పై జరుగుతున్న దాడుల నివారణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు ప్రతి చిన్న విషయానికి దాడులు చేస్తున్న పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో జర్నలిస్టుల పై వరుసగా దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ కల్పించడంలో అన్ని ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని, ఇలా అయితే జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలుగుతుందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా జర్నలిస్టుల కోసం జిల్లాల వారీగా రక్షణ కమిటీ ఏర్పాటు చేసి జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. APWJF ఆదోని డివిజన్ కమిటీ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టింది.సుబ్బారెడ్డి పై దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆదోని ఆర్డీఓ అరుణాదేవి కి వినతి పత్రం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదోని కమిటీ సభ్యులు మురళీకృష్ణ , ఆంజనేయులు,మీసా డేవిడ్,మల్లికార్జున,రఘునాథ్ రెడ్డి, సుంకన్న,తస్లీమా, చంద్రయ్య,ఎస్కే రెడ్డి,వినోద్ కుమార్,వీరేష్ ,ఈరన్న తదితరులు పాల్గొన్నారు.


